NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం కావలి పట్టణంలోని వైకుంటపురం అనప గుంట కాలువ పనులను పరిశీలించారు. ఈ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.