NLR: రాష్టంలో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా విచ్చేశారు. జాబ్ మేళాకు హాజరైన యువతకు దిశా నిర్దేశం చేశారు.