SRD: కంది మండలం బ్యాతోల్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారికి మొక్కినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.