NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పందుల నివారణకు చర్యల నిమిత్తం మంగళవారం డీపీవో అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో పందుల పెంపకం దారులతో సమావేశాన్ని నిర్వహించారు. పందుల షెడ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని వారు డీపీవోను కోరారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.