MBNR: గత BRS ప్రభుత్వ 10ఏళ్ళ పాలనలో రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. జానంపేటలో అడ్డాకుల, మూసాపేట్, భూత్పూర్ మండల పరిధిలోని 67మంది రైతులకు ఇవాళ ఎమ్మెల్యే ట్రాన్స్ఫార్మర్లు పంపిణీచేసి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతులకు విద్యుత్ కష్టాలు నివారించేల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించామన్నారు.