AP: ఈ ఏడాది రూ.1.34 లక్షల కోట్ల ఆదాయమే లక్ష్యమని CM చంద్రబాబు అన్నారు. ఆదాయార్జన్ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్నారు. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.