KMM: సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్లో అధికారులు అదనపు ప్లాట్ ఫామ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరాం ప్రత్యేక చొరవ, సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి సూచనలతో అన్నపురెడ్డిపల్లి, చాపరాలపల్లి, పాల్వంచ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సత్తుపల్లి బస్టాండ్లో రేకులతో అదనపు ప్లాట్ ఫామ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.