ప్రకాశం: కొరిశపాడు మండలం పమిడిపాడు మాజీ సర్పంచ్ కేసరి వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం రెడ్డిపాలెంలో ఆయన పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్, సొసైటీ ఛైర్మన్గా వెంకట రెడ్డి విశేషమైన సేవలు అందించాలని గరటయ్య గుర్తు చేశారు. ఆయన లేని లోటు బాధాకరమని అన్నారు.