JN: కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నియోజకవర్గ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ హాజరై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సేవలు ప్రతి కుటుంబానికి చేర్చాలని, బీఆర్ఎస్ అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.