GNTR: మే 15, 16 తేదీల్లో గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అనగాని సత్యప్రసాద్, హాజరుకానున్నారు. భూమి వివరాలను సాంకేతికంగా మెరుగు పరిచే దిశగా ఈ శిక్షణ సాగనుంది.