VZM: ఐక్య పోరాటంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గండేపల్లి భీముడు, పురం అప్పారావులు అన్నారు. మంగళవారం నరవ గ్రామంలో లెంక వారి చెరువు వద్ద ఉపాధి కూలీలకు ఉపాధి చట్టాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ కార్మికుల కూలీల అందరిని ఐక్యం చేసి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఐక్యంగా ఉంటామన్నారు.