RR: చేవెళ్ల మండలం పరిధిలోని మిర్జాగూడ, ఖానాపూర్ గ్రామాల మధ్యలో హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై మర్రిచెట్టు గాలివానకు విరిగిపడింది. ఈ చెట్టు రోడ్డుపై పడడంతో పూర్తిగా ట్రాఫిక్ కిలోమీటర్ మేర స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.