సత్యసాయి: కదిరి మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలని తెలిపింది. అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఎన్నిక జరగకపోతే, 20న పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.