E.G: నల్లగొండ నుంచి ఎర్ర గ్రావెలు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. కొన్ని రోజులుగా నల్లగొండ-కోటి కేశవరం వద్ద ఉన్న కొండలను కొంతమంది అక్రమార్కులు రాత్రివేళల్లో ప్రోక్లైన్ల సాయంతో తవ్వేసి ఎర్ర గ్రావెల్‌ను నిత్యం వందలాది లారీల్లో తరలిస్తున్నారు. అయితే ఈ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని తాహసీల్దార్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.