KKD: కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు . ఎస్పీ బిందు మాధవ్ జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 47 వినతులను స్వీకరించారు. అర్జీదారులతో ఆయన మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.