KKD: అన్నవరం సత్యదేవుని ఆలయం వేలాదిగా వచ్చిన భక్తులతో సోమవారం కిటకిటలాడింది. సత్యదేవుని కల్యాణోత్సవాలు, వేసవి సెలవులు, వివాహాల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సత్య దేవున్ని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,100 వ్రతాలు జరిగాయని అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.