TG: BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి విధ్వసం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రతి కార్యకర్త వరకు ప్రతీ ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.