TG: ఇటీవల కురిసిన వర్షాల దృష్ట్యా వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. పంటల్లో చీడపీడలు, తెగుళ్ల బెడద పెరగటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరిలో బ్యాక్టీరియా, ఎండాకు తెగుళ్లు ఉన్నట్లు అధికారులు మంత్రికి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.