• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాలువలను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

JN: జనగామ మండలంలోని గోపరాజుపల్లి, పెద్దపహాడ్ గ్రామాల కెనాల్ కాలువను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రవి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మకూరు కన్నబోయిన గూడెం ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయాలని తెలిపారు. నీళ్లు రావడానికి కృషి చేసిన కొమ్మూరికే ఆయా గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

September 23, 2024 / 08:26 PM IST

‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు విజయవంతం చేయాలి’

మన్యం: ఇది మంచి ప్రభుత్వం, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమంపై మార్గదర్శకాలు, సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు.

September 23, 2024 / 08:26 PM IST

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PLD: కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేటలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ సూచనలు మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం జడ్జి చాంబర్ లాగా ఉండకూడదని, నిబంధనను అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. తగు సూచనలు సలహాలు అందజేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. పౌరులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

September 23, 2024 / 08:23 PM IST

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం

KMR: జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్ , కోశాధికారిగా రాజు, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా ఎం సాని, సుధాకర్ గుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా హరినాథ్ పాల్గొన్నారు.

September 23, 2024 / 08:23 PM IST

ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ఎమ్మెల్యే రాము

కృష్ణా: ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ముందుగా వరద బాధిత గ్రామాల్లో పశువుల మేత కొరకు గుడ్లవల్లేరు మండలం వెనుతురమిల్లి గ్రామస్తులు, టీడీపీ నాయకులు పిచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో సమకూర్చిన గడ్డి వాహనాలను పరిశీలించారు.

September 23, 2024 / 08:21 PM IST

‘రేపు ఎచ్చెర్ల ఎమ్మెల్యే పర్యటన వివరాలు’

SKLM: మంగళవారం రణస్థలం మండలం కోష్ట పంచాయతీలో ఉదయం 9 గంటలకు పొలం పిలుస్తుంది కార్యక్రమలో పాల్గొంటారన్నారు. అంతరం పాతర పల్లి గ్రామంలో 10:30 గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

September 23, 2024 / 08:20 PM IST

‘బాలికల ఆశ్రమ పాఠశాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం’

KMM: గార్ల మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్స్, బాలికల అక్రమ రవాణా వంటి వాటిపై కళాబృందాల చేత ప్రదర్శన నిర్వహించారు. బాలికల సమస్యల పరిష్కారానికి భరోసా టీమ్స్ ఉంటాయని బాలికలకు తెలిపారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ వల్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ పేర్కొన్నారు.

September 23, 2024 / 08:19 PM IST

రాత్రిపూట పెరుగు తింటున్నారా..?

చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ పెరుగు తినడం మంచిది క...

September 23, 2024 / 08:19 PM IST

వైసీపీ వీడి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక

కడప: నగరంలోని 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ, వారి సతీమణి Ex కార్పొరేటర్ రాణి, వారి అనుచరులు సుమారు 100 కుటుంబాలు సోమవారం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిలు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

September 23, 2024 / 08:17 PM IST

రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీల్లో ఉద్యాన కళాశాల విద్యార్థి ప్రతిభ

WNP: పెద్దమందడి (M) మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థి అభిలాష్ రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ 6వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభిలాష్‌ను ఉద్యాన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ సైదయ్య మాట్లాడారు.

September 23, 2024 / 08:16 PM IST

‘టంగుటూరులో లాడ్జిలలో పోలీసుల తనిఖీలు’

ప్రకాశం: టంగుటూరులో ఎస్సై నాగమల్లేశ్వరరావు సోమవారం పలు లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. తర్వాత రూములలో ఉన్న అపరిచిత వ్యక్తులను ఆయన ప్రశ్నించి వారి ఐడీలను పరిశీలించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిరంతరం తనిఖీలు చేస్తామని చెప్పారు.

September 23, 2024 / 08:16 PM IST

’20 వంటగ్యాస్ సిలిండర్లు పట్టివేత’

ELR: నారాయణపురంలో పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 20 వంటగ్యాస్ సిలిండర్లను టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. నారాయణపురంలోని ఓ హోటల్లో 16, మరో హోటల్లో 4 మొత్తం 20 డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌గా వాడుతున్నారనే ఫిర్యాదుపై దాడులు చేసినట్లు విజిలెన్స్ సీఐ రామకృష్ణ, తహశీల్దార్ కన్యాకుమారి పేర్కొన్నారు.

September 23, 2024 / 08:15 PM IST

‘స్వగ్రామానికి చేరుకున్న మెడికో అమృత మృతదేహం’

VZM: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాడంగి మండలం డొంకినవలసకు చెందిన అమృత మృతదేహం స్వగ్రామానికి సోమవారం సాయంత్రం చేరుకుంది. అమృత మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

September 23, 2024 / 08:14 PM IST

కార్యకర్తతో ములాఖత్ అయిన మాజీ మంత్రి

JN: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నేతలను ఇటీవల ఓ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం జనగామలోని ఉప కారాగారం దగ్గరికి వెళ్లి వారితో ములాఖత్ అయ్యారు. జైల్లో ఉన్న నా కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉన్నారు అని వారు తెలిపారు.

September 23, 2024 / 08:11 PM IST

వరద బాధితుల పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు

AP: వరద బాధితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన  ఇళ్లు, పంటలు, వ్యాపారాలు, ఉపాధి, పరిశ్రమలు, పశువులు, కోళ్లు, వాహనాలకు ఆర్థిక సాయం అందించనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌‌లో ఉన్న బాధితులకు రూ. 25వేలు, ఆపై నివాసం ఉన్న బాధితులకు రూ. 10వేల పరిహారం ఇవ్వనుంది. కిరాణా, రెస్టారెంట్ వంటి చిన్న తరహా వ్యాపారులకు కూడా రూ.25వేల ఆర్థిక ...

September 23, 2024 / 08:10 PM IST