NRML: బైంసా మండలం వాలేగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి సోమవారం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కమిటీ హాల్ కొరకు 2 లక్షల 50 వేల సీడీపీ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం సంఘ నాయకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ELR: కొయ్యలగూడెంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రొక్కాల నాగరాజు, కరటూరి అబ్రహంలు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసి అవమానించిన రఘురామకృష్ణంరాజు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
W.G: అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని బోగోలు మాజీ సర్పంచులు చలమాల నాగేశ్వరరావు, కండవల్లి రాజు అన్నారు. సోమవారం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ATP: గుంతకల్లు పట్టణంతో పాటు మండల కేంద్రంలోని ప్రజలకు రేషన్ బియ్యాన్ని తగ్గించి ఇస్తున్న రేషన్ షాప్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గుంతకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం నాయకులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం తగ్గించి ఇస్తున్న రేషన్ షాప్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలన్నారు.
RR: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆయనను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాగా మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు...
GNTR: ఏపీ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఉండాలని మంత్రి లోకేశ్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యశాఖ అధికారులతో మంత్రి నివాసంలో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేసి మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్ పెంచాలన్నారు.
JN: తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక కమిటీ సభ్యులు పాలకుర్తి తహసీల్దార్‌కు సోమవారం వినతి పత్రం అందించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోరారు. రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీ నారాయణ, దుంపల సంపత్, భూమా రంగయ్య తదితరులున్నారు.
ప్రకాశం: మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలో చికిత్స పొందుతున్న జంకె వెంకటరెడ్డిని యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం పరామర్శించారు. ఈయనతో పాటు కనిగిరి ఇంఛార్జ్ దద్దాల నారాయణ జంకెని పరామర్శించారు.
తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్‌లో దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘సత్యం సుందరం’ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్, కార్తీ.. బావ- బావమరిదిగా నటించారు. కాగా ఈ నెల 28న థియేటర్లలో ప...
KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు అండగా ఉండటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
SRPT: తుంగతుర్తి మండల ఎరువుల దుకాణదారుల సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు పూసపల్లి యాదగిరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గౌరవ అధ్యక్షులుగా మేనేని మాధవరావు, అధ్యక్షుడిగా నిమ్మల వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా బొల్లం సైదులు యాదవ్, కోశాధికారిగా ఆకుతోట సోమన్నలను ఎన్నుకున్నారు.
WNP: రంగాపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం డీసీఎం వాహనం బైకును ఢీకొన్న ఘటనలో తల్లి, కూతురు మృతిచెందిన విషయం తెలిసింది. SI వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు..నాగరాల గ్రామానికి చెందిన పురందేశ్వర్ భార్యా పిల్లలతో బైక్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డుప్రమాదంలో పురందేశ్వర్ భార్య స్వాతి(26),కూతురు చిన్నారి అశ్విత(3) అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు.
TG: రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన...
కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంక 16వ వార్డు శివారు కౌశిక్ వద్దగల డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు సోమవారం గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ తొలగించకపోతే చెత్త చెదారం తీసుకువచ్చే వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గ్రామ సర్పంచ్ సునీతకు అందజేశారు.
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...