ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నాడు.