AP: వరద బాధితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లు, పంటలు, వ్యాపారాలు, ఉపాధి, పరిశ్రమలు, పశువులు, కోళ్లు, వాహనాలకు ఆర్థిక సాయం అందించనుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాధితులకు రూ. 25వేలు, ఆపై నివాసం ఉన్న బాధితులకు రూ. 10వేల పరిహారం ఇవ్వనుంది. కిరాణా, రెస్టారెంట్ వంటి చిన్న తరహా వ్యాపారులకు కూడా రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేయనుంది.