మెయిన్ బోర్డు కేటగిరిలో IPOకు వచ్చిన మన్బా ఫైనాన్స్ కంపెనీ సబ్స్క్రిప్షన్ క్షణాల్లోనే పూర్తయింది. ఇవాళ ఉదయం సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. కొన్ని నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్ అందుకుంది. IPOలో భాగంగా రూ.151 కోట్ల సమీకరణకు 1.26 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టింది. ధరల శ్రేణిని రూ.114-120గా నిర్ణయించింది. కనీసం 125 ఈక్విటీ షేర్లకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.