• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్యేను కలిసిన టీఎన్జీవోస్ హౌజింగ్ సొసైటీ సభ్యులు

MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును సోమవారం టీఎన్జీవోస్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఎస్. మొండయ్య, సభ్యులు శ్రీనివాసరావు దేశ్ పాండే పాల్గొన్నారు.

September 23, 2024 / 10:01 AM IST

ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు

SRPT: దేశ వ్యాప్తంగా ఈ రోజు బ్లాక్ డేగా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నడిగూడెం మండల సీఐటీయూ భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్‌కు బయలుదేరారు. జిల్లా కమిటీ సభ్యులు వల్లెపు శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వల్లెపు తిరుమలేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

September 23, 2024 / 09:59 AM IST

మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

TG: మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌ పార్క్‌ ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కు స్థలంలో ఏర్పాటైన స్పోర్ట్స్ అకాడమీపై ఫిర్యాదు చేయగా హైడ్రా చర్యలు తీసుకుంది. దీంతో అక్కడ అక్రమ షెడ్లను కూల్చివేసింది. అయితే పార్టు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు  తీసుకున్నామన్న స్టోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు.. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొల...

September 23, 2024 / 09:56 AM IST

కావూరి హిల్స్‌ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు

TG: మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌ పార్క్‌ ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కు స్థలంలో ఏర్పాటైన స్పోర్ట్స్ అకాడమీపై ఫిర్యాదు చేయగా హైడ్రా చర్యలు తీసుకుంది. దీంతో అక్కడ అక్రమ షెడ్లను కూల్చివేసింది. అయితే పార్టు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు  తీసుకున్నామన్న స్టోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు.. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొల...

September 23, 2024 / 09:56 AM IST

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 84,854 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 25,917 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ఉంది. 

September 23, 2024 / 09:56 AM IST

రెల్లి న్యాయవాదుల ఆత్మీయ సమావేశం

VSP: ఎస్సీ వర్గీకరణ, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణ జడ్జిమెంట్ అంశాలు గురంచి రిటైర్డ్ జడ్జి వడ్డాది శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ఈ ఆత్మీయ సమావేశానికి 16 మంది న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం రిటైర్డ్ జడ్జి వడ్డాది శ్రీనివాసరావు సన్మానించి.. న్యాయవృత్తిలో సలహాలను అడిగి తెలుసుకున్నారు.

September 23, 2024 / 09:54 AM IST

కలకలం రేపిన కొండచిలువ

NRML: బాసర మండల కేంద్రంలో సోమవారం కొండ చిలువ కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక స్వాధ్యాయ కేంద్రం ఎదుట ప్రధాన రోడ్డుపై కొండ చిలువ కనిపించడంపై స్థానికులు పరుగులు తీశారు. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా, చాకచక్యంగా పట్టుకుని గ్రామ పంచాయతీ చెత్త వాహనంలో సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

September 23, 2024 / 09:50 AM IST

ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్న నగర కమిషనర్

NLR: బుచ్చి పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అయ్యాయి. దీంతో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పట్టణంలో ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. దీంతో పట్టణంలో బలరాం నగర్ లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇంటి నిర్మాణం చేసుకొని ఈ స్థలాలను ఖాళీ చేయాలని వారికి సూచించారు.

September 23, 2024 / 09:49 AM IST

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

MHBD: గూడూరు మండల కేంద్రంలోని ZPHS సెకండరీ పాఠశాలలో 2007-08 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమ్మేళనంలో విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో సరదాగా గడిపారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

September 23, 2024 / 09:49 AM IST

ఉపద్యాయుల సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే

WNP: ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ప్రైవేట్ ‘ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు అందిస్తున్నారన్నారు.

September 23, 2024 / 09:48 AM IST

AI అంటే అమెరికా, ఇండియా: ప్రధాని

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో వ్యాపారవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నా దృష్టిలో AI అంటే అమెరికా, ఇండియా. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అభివృద్ధి.. ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు భరోసా ఇస్తుంది. వికసిత్ భారత్ వైపు మేము చేసే ప్రయాణానికి మూ...

September 23, 2024 / 09:48 AM IST

లావేరు ఎంఈఓకు ఎమ్మెల్యే ఘన నివాళులు

SKLM: లావేరు మండల విద్యాశాఖ అధికారి లండ ఈశ్వరరావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం అకాల మరణం పొందారు. ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

September 23, 2024 / 09:44 AM IST

నేటి నుంచి పలు రైళ్లు రద్దు

HNK: ఖాజీపేట- బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8 వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో మంచిర్యాల, కొమురంభీమ్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.

September 23, 2024 / 09:43 AM IST

నరసరావుపేట ఆసుపత్రి మేనేజర్‌ అరెస్ట్

PLD: నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్యోతి(33) అనే మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతిచెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సదరు ఆసుపత్రి మేనేజర్ సత్యను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

September 23, 2024 / 09:42 AM IST

ప్రారంభమైన మార్కెట్.. మిర్చి ధర ఎంత అంటే…!

KMM: రెండు రోజుల సెలవులు అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈరోజు ఉదయం తిరిగి ప్రారంభమైంది. మార్కెట్లో ఈరోజు క్వింటా ఏసి మిర్చి ధర రూ.20 వేలు ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి, క్రయ విక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.

September 23, 2024 / 09:41 AM IST