TG: మెదక్ జిల్లాలోని గోమారంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో తలెత్తిన ఘర్షణలపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. తమ గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తన అనుచరులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. తన ఇంటిపై రాళ్లు విసిరిన నిందితులు, బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.