TG: హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతలపై ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని విమర్శించారు. నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందన్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న వారికి నష్టపరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు.