NRML: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డా. తేజావత్ బెల్లయ్య నాయక్ ఈ నెల 24న జిల్లాకు వస్తున్నారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఛైర్మన్ బానోత్ గోవింద్ నాయక్ సోమవారం తెలిపారు. జిల్లాలోని గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.