AP: రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్యక్యాంటీన్లలో రూ.5కే ఆహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ రాయచోటీలోని అన్నక్యాంటీన్లో మాత్రం ఏడాది పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రూపాయి కూడా తీసుకోకుండా ఆహారం అందించాలని నిర్ణయించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే ఈ పథకాన్ని కూడా దూరం చేసిందని మండిపడ్డారు.