ATP: కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పౌష్టికాహారం పంపిణీపై ఆరా తీశారు. సమయపాలన పాటించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీ పిల్లలతో కాసేపు ముచ్చటించారు.