దేవర ప్రీ రిలీజ్ రద్దు కావడంపై అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈవెంట్ రద్దు చేశాం. బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.