AP: వంద రోజుల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని CM చంద్రబాబు చెబుతున్నారు. పింఛన్ రూ.4వేలకు పెంచడం, అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఇలా ఎన్నో చేశామని కూటమి నేతలు పేర్కొన్నారు. అయితే 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని.. అందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు YS షర్మిల ‘0’ మార్కులు వేసిన విషయం తెలిసిందే. మరి మీరెన్ని మార్కులు వేస్తారు..?