చైల్డ్ ఫోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనే పదాన్ని కోర్టులు ఉపయోగించవద్దని ఆదేశించింది. ఆ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవటం కూడా పోక్సో చట్టం ప్రకారం నేరమని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. కాగా, చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.