AP: శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేశామని TTD తెలిపింది. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొంది. ‘స్వామివారికి మహానైవేద్యం పూర్తి చేశాం. దోషం కలిగిందన్న భావన లేకుండా సంప్రోక్షణ చేశాం. పూర్ణాహుతితో అన్నీ దోషాలు తొలగుతాయి. ఇటీవల తెలిసీ, తెలియక చేసిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం’ అని వెల్లడించింది.