సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘ధమాకా’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమాకు ‘మజాకా’ టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో సంప్రదాయ ధోతీ లుక్లో కనిపించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించారు.