పంజాబ్‌లోని భటిండాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని కొందరు దుండగులు ఇనుప రాడ్లను ఉంచారు. ఈ విషయాన్ని గమనించిన గూడ్స్ రైలు లోకో ఫైలట్ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలో ఇలా రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నంచడం ఇది ఐదోసారి అని అధికారులు తెలిపారు.