VSP: ఆనందపురం మండలం వేములవలసలో ఆదివారం రాత్రి వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వాయుపుత్ర గణేశ్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 162 కేజీల లడ్డూను వేలం వేయగా.. దానిని వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రూ.1.62 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అనంతరం ఏర్పాటు చేసిన పలు సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.
SKLM: మందస మండలం బుడార్శింగి పంచాయతీ పెడంగో పాఠశాల విద్యార్థుల కోసం వాటరేడ్ పథకం ద్వారా మంజూరైన శుద్ధజల ప్లాంటు ఆరేళ్లుగా వృథాగా పడి ఉందని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఇంతవరకు కనీసం అమర్చలేదు. పాఠశాల ఆవరణలో వది లేసి ఉండటంతో ఎండ, వర్షానికి పాడవుతుంది. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
MBNR: రైలు ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర సమీపంలో ఉన్న కోటకదిరే శివారులో ఒక వ్యక్తి డోకూర్ శివారులో మరో వ్యక్తి రైలు కింద పడి మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. పలువురు మాట్లాడుతూ.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపచారం చేసిన ఎవరినీ వదిలిపెట్టకూడదని మండిపడ్డారు. ప్రపంచంలోనే తిరుపతి లడ్డుకు ప్రజలు అత్యంత ప్రథాన్యం ఇస్తారని, దానిని కూడా కల్తీ చేయడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు.
VSP: ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్‌లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఖడ్గమృగాల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను నిర్వహించినట్లు జూ అధికారులు తెలిపారు. జీవవైవిద్యంలో ఖడ్గ మృగాలు పోషిస్తున్న పాత్రపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
MBNR: జిల్లా దసరా ఉత్సవ నూతన కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీకి అధ్యక్షుడిగా చంద్రయ్య, ఉపాధ్యక్షుడిగా మెట్టుకాడి ప్రభాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనా జరగకుండా చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ పాల్గొన్నారు.
SKLM: ఇది మంచి ప్రభుత్వ కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కూన రవి కూమర్ సోమవారం ఉదయం 10.గంటలకు బుర్జా మండలం అల్లెన గ్రామంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యవర్గాలు తెలిపాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పాలవలస గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొనాలని తెలియజేశారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మాజీ ఎలక్ట్రియన్ తూము వెంకటయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
KMR: సాలురా మండలం మందార్నా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన వాగ్మరే శైలజ విద్యా వాలంటరీగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ రవిరాజ్, పాఠశాల ఛైర్మన్ సుస్మిత, సొసైటీ ఛైర్మన్ మందార్నా రవి, మాజీ సర్పంచ్ గంగాధర్, రమేష్, గ్రామస్థులు ఆమెను సన్మానించి అభినందించారు.
తూ.గో: రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ అసోషియేషన్ పిలుపు మేరకు జీఓ నెం. 85కి వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్స్ అమలాపురం ఏరియా హాస్పటల్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహించి ఆదివారం నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లాలో వివిధ పీహెచ్‌సీల నుంచి విచ్చేసిన డాక్టర్లు పాల్గొన్నారు.
AP: రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా...
MBNR: దేవరకద్ర మండలం కౌకుంట్ల మండలం వెంకటగిరిలో గత 2 రోజుల నుంచి మిషన్ భగీరథ తాగు నీరు రావడం లేదని ఆదివారం స్థానిక ప్రజలు తెలిపారు. అవసరాలకు నీరు లేక పలు అవస్థలు పడుతున్నామన్నారు. ప్రత్యామ్నాయంగా బోరు బావిని ఆశ్రయిస్తున్నారు. సంబందిత అధికారులు వెంటనే స్పందించి, నీటి సరఫరా అయ్యేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు.
WNP: ఆల్ ఇండియా స్థాయిలో ఇటీవల జరిగిన NCC మ్యాప్ రీడింగ్‌లో రెండో ర్యాంకు సాధించి సిల్వర్ మెడల్ దక్కించుకున్న గోమతిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. బాలిక తల్లిదండ్రులు సాయి లీల, శ్రీనులను మాజీ మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మరిన్ని మెడల్స్ సాధించాలని నిరంజన్ రెడ్డి అన్నారు.
తూ.గో: అధిక వర్షాల వల్ల ఖరీఫ్ వరి పంట నీట మునిగి కొంతమంది రైతుల నష్టపోగా ఉన్న పొలాలకు నీరు చేరే దారి లేకపోవడంతో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. మండల పరిధిలో 17 గ్రామపంచాయతీల్లో సుమారు 10,045 ఎకరాల్లో వరి పంటలను సాగు చేసినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి కె.చంద్రశేఖర్ తెలిపారు.
ప్రకాశం: మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేడు అన్నమాలవీడు గ్రామాన్ని ముత్తుముల అశోక్ రెడ్డి సందర్శించనున్నట్టు రాచర్ల ఎంపీడీవో వెంకటరామిరెడ్డి తెలిపారు. వంద రోజులు పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.