తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ 2019లో రిలీజై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై కార్తీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుగుతోందని, ఖైదీ 2 వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలిపాడు. అలాగే త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని పేర్కొ...
AKP: గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు పడాల శరత్ చంద్ర అనారోగ్యంతో మృతిచెందడం పట్ల అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు, అరుణ టీడీపీ పార్టీలో కలిసి పనిచేశామన్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఇప్పటికే పలువురు నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నటి ఐశ్వర్య పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ‘మారెమ్మ’ అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ‘అడవిని పీడించే అరాచకం.. మారెమ్మ, కుతంత్రమే ఆమె మంత్రం’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ASR: చింతూరు మండలం డొంకరాయిలో సోమవారం కారులో తరలిస్తున్న రూ.23 వేలు విలువ చేసే 4.5 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మణికంఠ, మధు కుమార్, ఏలూరు జిల్లాకు చెందిన మున్నిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారును, 2 సెల్ ఫోన్లును సీజ్ చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
VSP: విశాఖలో 200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను C.M చంద్రబాబు ఆదేశించారు. దీనికి అవసరమైన 30ఎకరాలను వెంటనే సేకరించాలని సూచించారు. పనులు ప్రారంభించి, పూర్తి చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలన్నారు. హిజ్రాలకు సింగిల్ రేషన్ కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
TG: ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం’ పేరుతో కాంగ్రెస్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారంలో బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీభవన్‌లో ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. రేపు తొలిరోజు మంత్రి రాజనర్సింహ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వచ్చే నెల 30 వరకు షెడ్యూల్ ఖరారైంది. రెండు వారాలకోసారి CM రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కు...
హెజ్‌బొల్లాతో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ పౌరులకు కీలక సూచనలు జారీ చేశారు. హెజ్‌బొల్లాకు ‘మానవ కవచాలు’గా మారవద్దని తెలిపారు. పౌరుల ఇళ్లలో మిస్సైళ్లు దాచిన హెజ్‌బొల్లాతోనే తమ యుద్ధం అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇళ్లలో క్షిపణులు, రాకెట్లు దాచారని మండిపడ్డారు.
కర్నూలు: ఎమ్మిగనూరు మండల పరిధిలోని బలవసి కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు రైతు సోదరులకు అందుబాటులో కలవు బలనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కే రాఘవేంద్ర, కోఆర్డినేటర్ మౌనికలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు సోదరులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ధర రూ. 50లకు దొరుకుతుందన్నారు. రైతులు వినియోగించవలసిందిగా కోరారు.
CTR: గుడిపాల మండలం బొమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై వంద రోజుల TDP పాలనా ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే పాఠశాలకు చేరుకుంటారని చెప్పారు.
VSP: హెల్మెట్ లేకుండా బైక్‌లు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఈనెల రెండవ తేదీ నుంచి 11 వరకు చేపట్టిన తనిఖీల్లో 5,985 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 5,331 మంది డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.
KRNL: స్వచ్ఛత – హి -సేవ” కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రాలయం మండలంలోని కలదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నల్లగౌని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో డాక్టర్‌లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి నాయుడు పాల్గొన్నారు.
ASR: గత ఏడు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వెలుగు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సోమవారం సాయంత్రం వారు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
AKP: దేవరాపల్లి తహశీల్దార్ ఎం. లక్ష్మీ బుచ్చియ్యపేట మండలానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవరాపల్లి ఎమ్మార్వోగా, కలెక్టరేట్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పీ. లక్ష్మీదేవిని నియమించారు. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
W.G: వరుస క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.
లడ్డూ వివాదంపై హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరబాద్‌లో జరిగిన ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో లడ్డూ అంశం వచ్చింది. ‘లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ మీమ్‌ను యాంకర్ చూపించారు. దాని గురించి మాట్లాడుతూ.. లడ్డూ గురించి నేను ఇప్పుడే మాట్లాడను. ఇప్పుడది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇలాంటి టైంలో మనకొద్దు’ అని చెప్పారు.