KNR: హుజూరాబాద్ సింగాపూర్ గ్రామంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం NSS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. NSS యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కందుకూరి శంకర్ మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి మేలు జరుగుతుందన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.
కృష్ణా: స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
NLR: వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3గంటల నుంచి 26న రాత్రి 7గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని MLA కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. బందోబస్తు భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు పోలీస్ సిబ్బందికి సూచనలిచ్చారు.
BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ICC కొత్త ఛైర్మన్‌గా BCCI సెక్రటరీ జై షా ఎన్నికైన నేపథ్యంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పనిసరి కానుంది. దీంతో బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు BCCI ఈ భేటీ కానుంది. కొత్త కార్యదర్శి నియామకం కోసం నామినేషన్ ప్రక్రియ మినహా ఎనిమిది అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం కోవూరు మండలంలో పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని పడుగుపాడు పంచాయతీ పరిధిలో నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
E.G: ప్రముఖ పార్మా కంపెనీ డాక్టర్ రెడీస్ లేబొరేటరీస్‌లో ఉద్యోగాలకు రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ రోజు ప్రాంగణ ఎంపికలు జరుగుతాయని ఇన్‌ఛార్జ్ ఉప కులపతి ఆచార్య వై శ్రీనివాసరావు తెలిపారు. 2023-24లో ఎమ్మెస్సీ ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
అన్నమయ్య: రైతులు ఖాళీగా ఉన్న భూములలో సాగు చేయుటకు 80 శాతం రాయితీతో ఉలవలు అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారి కిషోర్ నాయక్ తెలిపారు. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారి పల్లి, మోటకట్ల గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసిన వేరుశెనగ పంటను పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ యొక్క పథకాలను వివరించారు.
VZM: కౌలు రైతులు పండిస్తున్న అన్ని పంటలకు ఉచిత పంట భీమా సౌకర్యం కల్పించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు గాడి అప్పారావు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని కొత్తవలస MRO నీలకంఠరావుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. సహకార రంగాల్లో ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ఆధునికరించాలని, గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
SS: పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పాల్గొన్నారు. గంగవరం సాయంత్రం గ్రామ సరిహద్దు లోపల పొలాలలో మంత్రి ఎమ్మెల్యేలు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఆర్‌డీఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణం కరణం చిక్కప్ప పాఠశాల విద్యార్థులకు గ్రీన్ కో సంస్థ వారు క్రీడాకారుల కోసం అందజేసిన కిట్లను, ఎమ్మెల్యే సురేంద్ర బాబు పాఠశాలలోని క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగిన యువత ఉందని, అందుకు దాతలు ముందుకు వస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
KMM: నేలకొండపల్లి మండలం చెర్వమాదారంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరిపొలం వద్ద కిందపడ్డ బోరు మోటార్ తీగెను పోల్‌లో కడుతుండగా ప్రమాదవశాత్తు పరిటాల లింగయ్య (57) విద్యుద్ఘాతానికి గురై మృతిచెందాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున వినిపించారు.
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు స్థానిక ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు కేటాయించాలని కోరారు. క్లాసులు నిర్వహించుకోవడానికి తగిన రూములు లేవని, ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ లేకపోతే, ప్రైవేటు బిల్డింగులనైనా కళాశాలకు తాత్కాలికంగా కేటాయించాలన్నరు.
NLR:పీఎం సూర్యఘర్ ముఫ్రి బిజిలి యోజన పథకం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమీక్షించారు. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ATP: సోమందేపల్లి గ్రామం కొత్తపల్లి క్రాస్ కెనరా బ్యాంకు ఎదురుగా మంగళవారం సాయంత్రం గోవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతున్నాయి. ప్రతి రోజు సాయంత్రం ఈ రోడ్డులో కియా బస్సులు, బైకులు, ఇతర వాహనాలతో రద్దీగా ఉంటుంది. పశువులు ఇలా రోడ్డుపై తిరగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.