• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా ఆలయ పునః ప్రారంభోత్సవం

NLG: జిల్లాలో గొల్లగూడ పెద్ద బండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కంట మహేశ్వర స్వామి-సురమాంబ దేవి దేవాలయం పునః ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ హాజరయ్యారు. స్వామివార్లను దర్శించుకుని గొల్లగూడ- పెద్ద బండ ప్రాంతాలు సుఖశాంతులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా దీవించాలని ఆకాంక్షించారు.

September 25, 2024 / 05:04 AM IST

వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

E.G: మండపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.ఎస్ ఐ హరి కోటి శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఏడిద రోడ్డులోని పోలేరమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్న దిరిసాల ప్రభు కుమార్ భార్య చిట్టి వేణి భర్తతో గొడవ పడి గత కొన్ని రోజుల నుండి అమ్మ వారి ఇంటివద్దే వుంటుంది. దింతో మనస్థాపన చెందిన ఆమె మంగళవారం రేకుల షెడ్డుకు వున్న రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

September 25, 2024 / 05:04 AM IST

విశాఖ జిల్లాలో 5,331 మంది లైసెన్సులు రద్దు

VSP: హెల్మెట్ లేకుండా బైక్లు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్  కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఈ నెల రెండవ తేదీ నుంచి 11 వరకు చేపట్టిన తనిఖీల్లో 5,985 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 5,331 మంది డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.

September 25, 2024 / 05:03 AM IST

‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం’

NLR: నాయుడుపేట పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి జిల్లా ఉత్తమ ఉపాధ్యా యుడు మధుసూదన్‌తో పాటు మరో ఇద్దరిని ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునితోపాటు, ఏకొల్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, ఏపిటిఎఫ్ భీష్మ పితామహులు, విశ్రాంత హెచ్ఎం కె.వి.రమణారెడ్డిలకు ఏపీటీఎఫ్ విశిష్ట సేవ పురస్కారాలు అందించి సత్కరించారు.

September 25, 2024 / 05:00 AM IST

విశాఖలో ఈనెల 27న జాబ్ మేళా

VSP: విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం ఆవరణలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి శ్యాంసుందర్ తెలిపారు. వివిధ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు.

September 25, 2024 / 05:00 AM IST

పీజీ, డిప్లమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

VSP: ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

September 25, 2024 / 04:59 AM IST

ఈనెల 27న మంచిర్యాలలో ఉద్యోగ మేళా

మంచిర్యాల: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 27న HCL టెక్నాలజీ, టెక్ బీ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సీఈసీ, బైపీసీ, వొకేషనల్ గ్రూపులో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రావాలని తెలిపారు. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో పాటు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

September 25, 2024 / 04:58 AM IST

చిలగడదుంపలు చేసే అద్భుతం..!

చిలగడదుంపలు తింటే తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగం. ఇవి రోగాలు రాకుండా రక్షిస్తాయి. అందువల్ల చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే విటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం తయారవుతుంది. అందువల్ల రోజూ ఒక చిలగడదుంపను అయినా సరే ఉ...

September 25, 2024 / 04:58 AM IST

గత ప్రభుత్వ నిర్వాకంతోనే గండ్లు: ఉత్తమ్

ఖమ్మం: పదేళ్లలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే సాగునీటి కాల్వలు, చెరువులకు గండ్లు పడుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం, ఖమ్మం జిల్లా పరిధిలోని రంగుల వంతెన వద్ద సాగర్‌ కాల్వకు గండ్ల పూడ్చివేత పనులను, కలెక్టర్‌ తేజన్‌నంద్‌లాల్‌ పవార్‌తో కలిసి పరిశీలించారు.

September 25, 2024 / 04:58 AM IST

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసిన సొసైటీ ఛైర్మన్

NZM: నందిపేట్ మండలం ఐలాపూర్ PACS సొసైటీ ఛైర్మన్ మీసాల సుదర్శన్ మాజీమంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. అలాగే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

September 25, 2024 / 04:53 AM IST

నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వినోద్, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అంతర్గత రహదారులపై పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

September 25, 2024 / 04:53 AM IST

నేటి నుంచి జగ్గయ్యపేటలో హానికరమైన చెట్లు తొలగింపు

NTR: జగ్గయ్యపేటలో డివైడర్లు మధ్యలో ఉన్న హానికర కోనో కార్పస్ చెట్లను నేటి నుంచి యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. ఈ మొక్కలు మామూలు జీవుల వలె ఆక్సిజన్‌ను పీల్చుకోవడం వల్ల మానవాళికి ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉందన్నారు. దానిలో వచ్చే పూల వల్ల చిన్న పిల్లలలో ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేయడంతో తొలగిస్తామన్నారు.

September 25, 2024 / 04:53 AM IST

26న వివిధ అంశాలపై పోటీలు

VSP: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 26న వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. టూరిజం అండ్ పీస్ అనే అంశంపై పాఠశాలు, కళాశాలలో వ్యాసరచన చిత్రలేఖనం ఫోటోగ్రఫీ, లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

September 25, 2024 / 04:53 AM IST

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

VSP: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ సూచించారు. గంజాయి నిర్మూలనలో బాగంగా మంగళవారం హుకుంపేట మండలం, కామయ్యపేటలో అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన యువతకు వాలీబాల్‌ కిట్లు, వృద్ధులకు దుప్పట్లు ఎస్పీ పంపిణీ చేశారు. యువత సంపాదనకు సన్మార్గాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ నాగరాజు, సర్పంచ్ బెసు, సీఐ ఉన్నారు.

September 25, 2024 / 04:50 AM IST

అక్టోబర్ 2న పకనకుడిలో జన్ మన్ కార్యక్రమం

ASR: ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్ విధానంలో జన్ మన్ కార్యక్రమంను అక్టోబర్ 2న అరకులోయ మండలం, పకనకుడి గ్రామంలో నిర్వహించనున్నట్లు ITDA పిఓ అభిషేక్ తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఓ తెలిపారు. జన్ మన్‌లో ప్రధాని ప్రజలతో మాట్లాడతారన్నారు. జన్ మన్‌ను విజయవంతం చేయాలని అధికారులను కోరారు.

September 25, 2024 / 04:46 AM IST