SRD: పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలతో జరిపించారు. మహన్యాస రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండ్లతో ప్రత్యేకంగా శివలింగానికి అలంకరించారు.
స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రెండో పాటపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Raa Macha Macha అంటూ ఈ పాట సాగుతుందని రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అతడు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. దుబాయి లేదా అమెరికా వెళ్లినట్లు సమాచారం. కాగా పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్‌బాస్ OTT కంటెస్టెంట్ హర్షసాయిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప...
TG: ప్రమాదంలో మత్స్యకారుల జీవనం ఉందని మాజీ మంత్రి KTR తెలిపారు. వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారని ఆగ్రహించారు. చేపలు వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా..? అని ఆగ్రహించారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలనే రాజకీయ కక్షతో మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్త...
కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే అధిక బరువుని తగ్గించుకోవట్టు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోట...
SRD: సింగూర్ ప్రాజెక్టులో 10,431 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు బుధవారం ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 29.917 TMCలకు గాను 29.768 TMCల వద్ద జలాలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. అయితే క్రస్ట్ గేటు ద్వారా 8142cs, జెన్కో విద్యుత్ ఉత్పత్తికి 2818, ఇతరత్రా 501 క్యూసెక్కులు వరద బయటకు విడుదలవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారికి ఉచితంగా నకళ్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ శాఖలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలిపింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల జారీకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచి వారం పాటు ప్రత్యేక క్యాంపులు నిర...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 56.19 పాయింట్ల నష్టంతో 84,857.85 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 16.10 పాయింట్లు కుంగి 25,924.30 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.58గా ఉంది.
ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ చెన్నై అపోలో ఆస్పత్రిలో నేడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పార్థివదేహాన్ని ఉదయం 10 గంటలకు నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌కు తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈమె ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వదిన అవుతారు.
AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సంద్భంగా బాలినేని అభిమానులు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీల చింపివేత వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాద...
KNR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామడుగు మండలం గుండి గ్రామ చెరువు మత్తడి పోయడంతో గుండి నుండి లక్ష్మీపూర్, దత్తోజిపేట, చొప్పదండి, కరీంనగర్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, దత్తోజిపేట వివిధ గ్రామాల నుంచి గోపాలరావుపల్లె స్కూళ్లకు బస్సుల ద్వారా వెళ్లే విద్యార్థులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని వస్తున్నామని చెబుతున్నారు.
నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంకా ఈ మూవీ రేపటితో 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 7 గంటలకు HYDలోని మైత్రీ విమల్ థియేటర్‌లో స్పెషల్ షో వేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేస్తూ.. ఈ షోను మూవీ టీంతో కలిసి చూడవచ్చని మేకర్స్ తెలిపారు.
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఖమ్మం: ఆళ్ళపల్లి మండలంలోని జాకారం మండల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న షేక్ మహమ్మద్ పాషా ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. కాగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రేవంత్, సంఘమిత్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్ పాషాను కలిసి సన్మానం చేశారు.
AP: వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 56,196 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 35,315 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 874.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.