AP: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుదలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరల పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు వెలువరించింది. కాగా 14 రోజుల పాటు టికెట్ ధరలను మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్లలో రూ.110 పెంచుకునేలా ప్రభు...
JN: జనగామ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్య ఎనిమిదో వార్షికోత్సవానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు మహిళా సమాఖ్య సంఘంలోని సభ్యులు ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మహిళ ఎంపీ సమాఖ్య సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
ASR: నెహ్రూ యువ కేంద్రం & అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిపారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడం, మొక్కలు నాటడం పై అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యార్ధులు పరిసరాల పరిశుభ్రత, మొక్కలు పరిరక్షణలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ డా నాయక్ అన్నారు. పెదలబుడు వైస్ సర్పంచ్ చందు నిర్మల, NYK ఆఫీసర్ మహేశ్వరరావు మొక్కలు నాటారు.
NTR: వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్, బర్త్, డెత్, మ్యారేజీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, రిజిస్టర్ డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా, నాశనమైన డూప్లికేట్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రుణమాఫీ కానీ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతులు ఆందోళన చేశారు. సొసైటీ సీఈవో నిర్లక్ష్యం వల్లనే తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. సొసైటీలో 45 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
KMM: నగరంలోని 16వ డివిజన్ శ్రీరామ్ నగర్‌లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తనను ఖమ్మం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, ఖమ్మం కీర్తి ప్రతిష్ఠ పెంచేలా పనిచేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
WGL: బీజేపీ పాలనలో భారతదేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రేమేందర్ రెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలను చేపట్టారు. సభ్యత నమోదులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
BHPL: అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ దృష్ట్యా వాయుసేనలో చేరే వారికి అగ్నిపథ్ స్కీమ్ గురించి అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు భూపాలపల్లి జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఆరూరి శ్యామల తెలిపారు. ఈ నెల 27న కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గం. లకు అవగాహన సదస్సు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: గత ప్రభుత్వం రివర్స్ ట్రెండరింగ్ కారణంగా బుడమేరు విజయవాడను ముంచేసిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీలో అపచారం జరిగిందన్నారు. సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి కోడిగుడ్ల గురించి మాత్రమే మాట్లాడారన్నారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులు డిజిటల్ పే పై విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి డిజిటల్ పే ద్వారా చరవాణిని ఉపయోగించి బకాయిలు ఎలా చెల్లించాలో వివరించారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ.. విద్యుత్ బకాయలు వెను వెంటనే చెల్లించాలని సూచించారు. ఎస్ఏ రాజమురళి, ఎల్ఎం సంతోష్, ఏఎల్ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
SRCL: ఫుట్ పాత్ ఆక్రమించి షాపులు నిర్వహిస్తున్న టెలలు, తోపుడు బండ్లను రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి బుధవారం తొలగించారు. ఆలయ ధర్మశాలల వద్ద డ్రైనేజీలపై షాపులు నిర్వహిస్తూ భక్తులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న షాపులను తొలగించారు. 40 పిట్ల రోడ్డును ఆక్రమించి 10పిట్లకు కుదించకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో తొలగించామని మీడియాతో తెలిపారు.
NLG: ఆరోగ్య గ్రామాల పరిరక్షణే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వి.సత్యనారాయణ అన్నారు. పీఏపల్లి మండలం అజ్మాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. 250 మందికి గుండె, కంటి, ఆర్తో లాంటి పరీక్షలను నిర్వహించి మందులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ ఛైర్మన్ భిక్షమయ్య, వనం శ్రీను, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
AP: ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. మట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్నారని.. అవి CRZ, జియో హెరిటేజ్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా పనులు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు నిలిపివేయాలని కోర్టు చెప్పింది. ఈ మేరకు GVMC, ఇతర సంబంధిత శాఖలకు నోటీసులి...
BHPL: రేగొండ మండల పరిధిలోని జగ్గయ్యపేట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు బ్లౌజులు, డ్రెస్, సబ్బులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు కొబ్బరినూనె జీపీ ప్రత్యేక అధికారి అనుమతితో అందించినట్లు ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు వీరబ్రహ్మం అన్నారు.
VZM: పెరుమాళి వ్యవసాయ మరియు అనుబంధశాఖల ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది ‘ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, తెగుళ్ల నివారణ, ఉద్యానవన పంటల యాజమాన్యం మరియు పాడి రైతులకు పశు భీమా, టీకాలు ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గుల్లిపల్లి సునీల్ కుమార్, ఉద్యానవన అధికారి మోహన్ క్రిష్ణ, పాల్గొన్నారు.