ATP: అనంతపురం నగరంలోని NH42 అర్బన్ లింక్ రోడ్డు పనులను త్వరగా చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం నగరంలోని సప్తగిరి సర్కిల్లో లింకు రోడ్డు పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని అర్బన్ లింకు రోడ్డుకు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ పాతబస్తీలో బుదవారం మొసలి కలకలం సృష్టించింది. బహదుర్‌పుర నాలాలో మొసలి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారు జూ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘వెట్టయాన్’. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ ‘వేట్టయాన్ ప్రివ్యూ’ పేరుతో తెలుగు టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున...
మన్యం: పాలకొండ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వాస రాయి కళావతి సీతంపేటలో స్థానిక ముఖ్య పార్టీ నేతలు కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. సీతంపేటలో త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం తదితర వాటిలో సమస్యలు గుర్తించాలని అన్నారు.
అన్నమయ్య: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, 24వ వార్డు మాజీ కౌన్సిలర్, ఇంఛార్జి తలారి రాధా అన్నారు.100 రోజు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు.
MDK: పెద్ద శంకరంపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయుడి చిత్రపటానికి బీజేపీ మండల అధ్యక్షుడు కోణం విఠల్, మండల బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు దీన్ దయాల్ చేసిన సేవలపై వారు కొనియాడారు.
VSP: సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు తయారీ అంశంలో చేసిన ఆరోపణలను వైసీపీ ఖండించింది. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆందోళన నిర్వహించారు.
VSP: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పిసిసి మాజీ అధికార ప్రతినిధి ప్రియాంక దండి బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో భేటీ అయ్యారు. మహిళల సాధికారత స్వయం ఉపాధిపై పార్టీ తరఫున పని చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో అన్ని అంశాలలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తానన్నారు.
AP: లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యతో వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు పోలీస్ కమిషనర్‌తో MLA రాజేందర్ రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
హర్యానాలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఆశలు సన్నగిల్లుతున్నాయని ఎద్దేవా చేశారు. పదేళ్ల క్రితం హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రాన్ని అల్లుడు, దళారులకు అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎక్కడ అడుగుపెట్టినా అవినీతి, బంధుప్రీతి తప్పవని దుయ్యబట్టారు.
SRD: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బాగంగా ఈ రోజు సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మికులకు బుధవారం హెల్త్ చెకప్ చేశారు. ఈ సందర్భంగా వారికి గ్లౌసేస్, సేఫ్టీ హెల్మెట్స్, డ్రెస్సులను ఎంపీడీవో మల్సూర్ నాయక్ అందజేశారు. ఈ మేరకు గ్రామ స్వచ్ఛతకు చేపట్టాల్సిన చర్యల పట్ల ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
SKLM: సర్వజన ఆసుపత్రి పరిధిలో గల రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో బుధవారం వరల్డ్ ఫార్మసిస్ట్ డే కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కె. రవి వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యరంగంలో వైద్యులతో పాటు ఫార్మసిస్టుల పాత్ర కూడా అవసరమని అన్నారు.
BHPL: గణపురం మండలంలోని కోటగుళ్లను బుధవారం తెలంగాణా రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ గిరిధర గోపాల్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి గౌడ్ కోటగుళ్లు చరిత్రను వారికి వివరించారు. అనంతరం అర్చకులు నాగరాజు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
MHBD: తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను MLA యశస్వినిరెడ్డి సందర్శించారు. కళాశాలలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బోరు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ఎమ్మెల్యే మాట్లాడి వారి బాగోగులను, సమస్యలను అడిగి తెలుసుకుని కష్టపడి చదవాలని సూచించారు.