భారత జనాభా వృద్ధిరేటులో రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగ...
ప్రకాశం: మూసీకి ఒక TMC సాగర్ నీరు రామతీర్థం జలాశయం నింపి అలుగు ద్వారా ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు కేజీ మస్తాన్, కె వీరారెడ్డి ఆధ్వర్యంలో కొండపిలో కలెక్టర్ ఆన్సారియా, మంత్రి స్వామిని కలసి వినతి పత్రం ఇచ్చారు. గతంలో రైతు సంఘాలు చేసిన ఉద్యమాల్లో తాను భాగస్వామినేనని ఈ ప్రాంత ప్రజానీకానికి సాగర్ నీరు అవసరం ఎంత ఉందో తనకు అవగాహన ఉందని పేర్కొన్నారు.
VZM: మత్స్యకారులు సేంద్రియ విధానంలో చేపల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలో మొబైల్ ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. చెరువులను అభివృద్ధిచేయాలని, రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని, మహిళా మత్స్యకార సంఘాలు స్వయం ఉపాధికింద రంగు చేపల పెంపకంపై శిక్షణ ఇవ్వాలని, చేపల నిల్వ కోసం శీతలీకరణ కోసం కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేయాలని మత్స్యకార నాయకులు కోరారు.
NZM: గాంధారి మండలానికి నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు రాజు తెలిపారు. మండల కేంద్రంలో పాఠశాల క్రీడలను ఆయన ప్రారంభిస్తారన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
GNTR: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గురువారం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గుంటూరులోని తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు చెప్పారు. పవన్ అడుగుజాడల్లో నడచి, రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు భాగస్వామిని అవుతానని అన్నారు. నాయకులు, కార్యకర్తలు తనకు సహకరించాలని అన్నారు.
NLR: నాయుడుపేట మెడికల్ అసోసియేషన్ వారి సారథ్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మెడికల్ షాప్లలో పనిచేస్తున్న ఫార్మసీస్ట్లకు శాలువా మొమెంటోలతో సన్మానం చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డీస్ ఫార్మసీ తరుణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సత్యసాయి, మెడికల్స్ అశోక్ కుమార్ రాజు, ట్రెజరర్ బాలాజీ మెడికల్స్ మురళి తదితరులు పాల్గొన్నారు.
SKLM: జిల్లాలో ప్రభుత్వ శాఖలకు బదిలీల్లో భాగంగా కొత్తగా జిల్లా స్థాయి అధికారులు విధుల్లోకి చేరుతున్నారని.. వీరంతా కష్టపడి పనిచేసి జిల్లా ప్రగతికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆకాంక్షించారు. ఉదయం 2వ, 4వ, 7వ, 1వ స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించగా, మధ్యాహ్నం జరిగిన 3వ, 5వ, 6వ స్థాయి సంఘ సమావేశాలకు పాలిన శ్రావణి వహించారు.
NLR: దుత్తలూరు అటవీశాఖ డిఆరీగా రవీంద్రబాబుకు అదనపు బాధ్యతలు జిల్లా ఉన్నత అధికారులు అప్పగించారు. ఈయన మర్రిపాడు డిఆర్గా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో పలు కేసులు చేధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపదను తరలిపోకుండా ఉండేందుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్నారు.
MDK: ప్రభుత్వ మెడికల్ కళాశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు. వైద్య కళాశాల తరగతులకు సంబంధించి ఆయన మాట్లాడుతూ. 2వ రౌండ్ నేషనల్ పూల్ కౌన్సెలింగ్‌లో ఏడుగురు విద్యార్థులకు నలుగురు GMC మెదక్‌లోఇద్దరు కేరళనుంచి ఒకరు హర్యానా రాజస్థాన్ నుంచి వచ్చారన్నారు. కళాశాలకు కావాల్సిన ఫ్యాకల్టీలను ప్రభుత్వం నియమిస్తుందన్నారు.
ELR: డిసెంబరు 8న నిర్వహించనున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు గడువును పెంచినట్లు డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కృష్ణ: ఇటీవల కురిసిన భారీవర్షాలకు ఐతవరం గ్రామంలో రహదారులు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుధవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఐతవరం జాతీయ రహదారివద్ద జరుగుతున్న మార్జిన్ పనులను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసిందన్నారు. నష్టపరిహారం తదితర కార్యక్రమాలతో పాటు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టిందన్నారు.
NGKL: బల్మూర్ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మండలానికి చెందిన ముఖ్య నాయకులతో బుధవారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు. మండలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.
SRD: కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు SRD కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి సివిల్ సప్లై డీఎం కొండల్ రావు పాల్గొన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు జోన్ పరిధిలోని విద్యార్థులకు ఎర్రగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలను బుధవారం ఎమ్మెల్యే ఆదినారాయణ సందర్శించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. అదేవిధంగా గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
WGL: నర్సంపేట పట్టణ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం ఐక్యవేదిక కన్వీనర్ సాంబరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పని చేసిన ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.