• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

GREAT: సత్తా చాటిన భారత్

ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్‌లో భారత్ సత్తా చాటింది. జపాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో అమెరికా, చైనా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఆ సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో.. పవర్ ఇండెక్స్ రే...

September 26, 2024 / 06:32 AM IST

ఈ నెల 27న షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు

ASF: జిల్లా కేంద్రంలోని TWRP బాలికల పాఠశాల గ్రౌండ్‌లో ఈ నెల27న అండర్-19 షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ గురువేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, నాలుగు ఫొటోలు, బోనోఫైడ్ సర్టిఫికేట్‌తో పీఈటీని సంప్రదించాలన్నారు.

September 26, 2024 / 06:32 AM IST

నేడు యోగా శిక్షకులకు ఇంటర్వ్యూ

సంగారెడ్డి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సింటర్స్ను రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నందున, కాంటాక్టు పద్దతిలో యోగా శిక్షకులను నియమిస్తున్నట్టు ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి నర్మదా తెలిపారు. మెదర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆయు ర్వేద హాస్పిటల్లో ఈ నెల 26న ఉదయం10.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

September 26, 2024 / 06:29 AM IST

తిరుపతి లడ్డు పై స్పందించిన ఎమ్మెల్సీ

SKLM: టెక్కలి నియోజకవర్గం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. సీట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని స్పందించారు. కోట్లాదిమంది ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా వాడుకోవడం తగదని, నిజంగా తప్పు జరిగి ఉంటే శిక్షకు సిద్ధంఅనవసరంగా కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారన్నారు.

September 26, 2024 / 06:28 AM IST

8వ సారి తలనీలాల సేకరణ వేలం వాయిదా

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే తలనీలాల సేకరణ లీజు హక్కు పొందేందుకు అధికారులు నిర్వహించిన వేలం మరోసారి వాయిదా పడింది. అనివెట్టి మండపంలో బుధవారం వేలం నిర్వహించగా పాల్గొనేందుకు ఒకే ఒక్కరు రావడంతో అధికారులు వాయిదా వేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నా.. వాయిదా పడుతూనే ఉందన్నారు.

September 26, 2024 / 06:25 AM IST

ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు రాక రోగుల పాట్లు..

ఏలూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్లు రాక రోగులు విలవిల్లాడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలోని ఎన్ఆర్టీ సెంటర్ సమీపంలో పైపులైను పగిలిపోయింది. దానిని సిబ్బంది గుర్తించలేకపోవడంతో పంపుల్లో ఒక్క చుక్క నీరురాక.. రోగులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నరక యాతన పడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.

September 26, 2024 / 06:25 AM IST

సముద్రంలోకి 1.70 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

EG: రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం రాత్రి 1.70 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 9, 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.

September 26, 2024 / 06:23 AM IST

పశ్చిమ దేశాలకు పుతిన్ అణు దాడి హెచ్చరికలు

తమకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అత్యాధునిక క్రూయిజ్ మిస్సైల్స్ సరఫరా చేయడంపై రష్యా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఉక్రెయిన్ గగనతల దాడులకు సంబంధించి పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు దాడి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఉక్రెయిన్‌కు యూకే క్రూయిజ్ మిస్సైల్స్ సరఫరా చేయడంపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నారు. అణు నిరోధకతపై మాస్కోలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమై చర్చించారు.

September 26, 2024 / 06:22 AM IST

మోడల్ CSC పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

ADB: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా DCC, DLRC బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. మోడల్ CSC పోస్టర్‌ను ఆవిష్కరించారు. పంట రుణాలు, రుణమాపీ, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల అమలుపై బ్యాంకుల వారిగా సమీక్షించారు. ఎల్‌డీఎం శేఖర్, డీఆర్డీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.

September 26, 2024 / 06:20 AM IST

అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

కోనసీమ: అమలాపురం రావులచెరువులో అగ్నిప్రమాదంలో గాయపడిన 13 మంది బాధిత కుటుంబాలకు శెట్టిబలిజ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బుధవారం సాయంత్రం సహాయం అందించారు. ఈ ప్రమాదంలో మృతురాలు గొవ్వాల నాగలక్ష్మి కుటుంబానికి రూ. 1,30,000 మిగిలిన బాధితులకు రూ.10,000 చొప్పున సహాయాన్ని సంఘం నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాని, నాగేంద్ర, పాల్గొన్నారు.

September 26, 2024 / 06:19 AM IST

ఆమదాలవలస అలుముకున్న పచ్చని పోదులు

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పాత ఆమదాలవలస వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభంకు పచ్చని చెట్లు, పొదలు అల్లుకోవడంతో చిన్న గాలి వేసిన విద్యుత్ తీగలు నుంచి నిప్పులు రాలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలపై అలుముకున్న పచ్చని చెట్లును తొలగించాలని కోరుతున్నారు.

September 26, 2024 / 06:18 AM IST

‘మహిళలు శక్తివంతులుగా మారాలి’

కోనసీమ: మహిళలు సమాజంలో శక్తివంతులుగా మారాలని మహిళా జైలు సూపరిండెంట్‌ వసంత కె. చెట్టి అన్నారు. బుధవారం ఆర్ట్స్‌ కళాశాలలో ‘నేను మీకు తెలుసా?’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. సైబర్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

September 26, 2024 / 06:18 AM IST

గ్రామీణ స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలి: ఎంపీ

మేడ్చల్: ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లో బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో.. బీజేపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు చేయించాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలన్నారు.

September 26, 2024 / 06:18 AM IST

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

TG: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 68,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 77,828 క్యూసెక్కులు నమోదైంది. 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

September 26, 2024 / 06:15 AM IST

‘పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం’

కోనసీమ: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అంటూ ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మాస ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్‌ టీడీపీ రైతు అధికార ప్రతినిధి స్థానిక ఈదల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) సౌజన్యంతో సమకూర్చిన చీరలు, పండ్లు, స్వీట్స్‌, గాజులు 25 మంది గర్భిణీలకు అందజేశారు.

September 26, 2024 / 06:15 AM IST