ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్లో భారత్ సత్తా చాటింది. జపాన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో అమెరికా, చైనా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఆ సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో.. పవర్ ఇండెక్స్ రేటింగ్స్ సాధించగలిగింది.