కృష్ణా: తొలి అడుగు అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి పంటకే నీళ్లు ఇవ్వలేకపోవడం బాధాకరమని వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సత్వరమే నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.