ప్రకాశం: గిద్దలూరుకు చెందిన లక్ష్మీ ప్రశాంతి అత్తింటి వాళ్ళు వేధిస్తున్నారని నిద్ర మాత్రలు మింగి సోమవారం ఆత్మహాత్యకు యత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో భర్త రంగనాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్త, ఆడబిడ్డ, ఆడబిడ్డ భర్త ఆస్తి వివాదంలో వేధిస్తున్నట్లుగా బాధితురాలు వెల్లడించింది. పోలీసులు విచారణ చేపట్టారు.