WNP: జిల్లాలో విద్యా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి పవన్ కుమార్.. కలెక్టర్ ఆదర్శ సురభికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, హాస్టళ్లలో పోషకాహారం, బోధన సిబ్బంది నియామకం అంశాలపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు.