VSP: ఆనందపురం మండలం దబ్బంద టిడ్కో ఇల్లుకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ఇళ్లకు స్ట్రీట్ లైట్స్, రోడ్లు, తాగునీరు, ఆసుపత్రి, పార్కు, ఆటస్థలం, ట్రాన్స్పోర్ట్, షాపింగ్ మాల్ వంటి సదుపాయాలు కల్పించాలని సీపీఐ నాయకుడు షేక్. రహిమాన్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.