NZB: ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తీన్మార్ మల్లన్న నీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.